కుమారి ఆంటీ( Kumari Aunty ) పరిచయం అవసరం లేని పేరు.కేవలం తన జీవనోపాధి కోసం రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ పెట్టుకుని అందరి కడుపులను నింపుతూ తన జీవనోపాధిని వెతుక్కున్నటువంటి ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
ఈమె మాట తీరుతో ఎంతోమంది రీల్స్ చేయడం అలాగే యూట్యూబ్ ఛానల్ వారు ఈమెను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయారు.ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.

ఇలా ఒక సాధారణ జీవితం గడుపుతున్నటువంటి మహిళ సోషల్ మీడియా ద్వారా ఏకంగా సెలబ్రిటీగా మారిపోవడంతో కుమారి ఆంటీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.తాజాగా ఈమెకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె ఒక గోల్డ్ షాప్ కి వెళ్లి భారీ ఎత్తున బంగారం( Gold ) కొనుగోలు చేశారని తెలుస్తుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈమె సుమారు 100 గ్రాములకు పైగా బంగారు హారం కొనుగోలు చేశారని తెలుస్తోంది.దీని విలువ సుమారు 7 లక్షల కు పైగా ఉంటుందని సమాచారం.

ఈమె ఇతర సెలబ్రిటీల మాదిరిగా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లారో తెలియదు లేదా నిజంగానే బంగారం కొన్నారో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.అయితే తాను ప్రతినెల కొంత డబ్బును స్కీం రూపంలో చెల్లించి కొనుగోలు చేస్తున్నానని తెలిపారు.ఆడవాళ్లకు బంగారం అంటే ఇష్టం కావడంతో నా కష్టార్జితంతోనే కొంటున్నానని ఈమె తెలిపారు.ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో పలువురు ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.
మీరు చాలామందికి స్ఫూర్తి అంటూ కొందరు కామెంట్లు చేయగా,మరికొందరు ఇలాంటి వీడియోలు అన్ని బయట పెట్టకండి ఇప్పటికే మీకు చాలా దిష్టి తగిలింది.ఇలాంటి వీడియోలన్నీ బయట పెట్టడంతో కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
మరికొందరైతే అక్కో ఇన్కమ్ టాక్స్ వాళ్లు రైడ్ చేస్తారు జాగ్రత్త అంటూ కామెంట్ లు పెడుతున్నారు.