మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరపున రేపు మునుగోడు నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు.
అదేవిధంగా రేపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.దీంతో కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిలతో పాటు వామపక్ష నేతలు పాల్గోననున్నారు.
ఉపఎన్నిక ప్రచారంపై పార్టీ నేతలతో కేటీఆర్ రివ్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే పలుసార్లు ఇంఛార్జ్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.