కాంగ్రెస్‌కు సంచ‌ల‌న స‌వాల్ విసిరిన కేటీఆర్‌..

ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కేటీఆర్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న మాదిరిగా రాజ‌కీయాలు సాగుతున్నాయి.అనూహ్యంగా రేవంత్‌రెడ్డి త‌న టార్గెట్‌ను కేసీఆర్ కంటే కూడా కేటీఆర్ మీదకే మ‌ళ్లిస్తున్నారు.

 Ktr Throws Sensational Challenge To Congress Ktr, Congress,telongana News-TeluguStop.com

దీంతో కేటీఆర్ కూడా అదే స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.రీసెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ మీద చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన ఆడియో క్లిప్‌ను కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌య‌ట‌పెట్టి పైచేయి సాధించారు.

దీంతో చివ‌ర‌కు రేవంత్ క్ష‌మాప‌ణ చెప్పాల్సి వ‌చ్చింది.ఇక ఇప్పుడు కేటీఆర్ మ‌రోసారి రేవంత్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

శ‌శిథ‌రూర్ తెలంగాణ రాష్ట్రాన్ని పొగిడితే రేవంత్ స‌హించ‌ట్లేద‌ని, అలాంటి వ్య‌క్తి తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా అంటూ ప్ర‌శ్నించారు.త‌మ కాంగ్రెస్‌కు చెందిన జాతీయ నాయకుడినే రేవంత్ గాడిద అంటే మ‌రి రేవంత్ రెడ్డి అడ్డ గాడిదనా నిలువు గాడిదనా అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు కేటీఆర్‌.

ఇక మొన్న విమోచ‌న దినం సంద‌ర్భంగా నిర్మల్ వేదికగా బీజేపీ నాయ‌కులు బ‌హిరంగ స‌భ‌లో, అదే విధంగా గజ్వేల్ లో కాంగ్రెస్ ద‌ళిత‌, గిరిజ‌న దండోరాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.కాగా ఈ రెండు స‌భ‌ల‌పై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Telugu Cm Kcr, Congress, Congressmp, Rahul Gandhi, Revanth Reddy, Tg-Telugu Poli

ఇక ఇదే సమయంలో త‌న‌పై ప‌దే ప‌దే కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న డ్ర‌గ్స్ అంశంపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.అదేంటంటే త‌న‌పై చాలామంఇ డ్రగ్స్ అంబాసిడర్ అని కామెంట్లు చేస్తున్నార‌ని, త‌న‌ను ప‌ట్టుకుని అలా మాట్లాడుతున్న వారు అస‌లు మ‌నుషులేనా అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు కేటీఆర్‌.ఇంకో అడుగు ముందుకు వేసి తాను డ్ర‌గ్స్ టెస్టు కోసం త‌న రక్త నమూనాలతో పాటు లివర్ టెస్ట్ ఇస్తాన‌ని, కాంగ్రెస్‌కు త‌మ మాట‌ల మీద‌ చిత్త‌శుద్ధి ఉంటే లేదంటే ఏ మాత్రం దమ్మున్నా కూడా రాహుల్ గాంధీని కూడా టెస్టుకు వస్తాడా అంటూ సంచ‌ల‌న విసిరారా కేటీఆర్‌.

ఏదేమైనా కూడా ఈ స‌వాల్ స్వీక‌రించ‌డం కాంగ్రెస్‌కు కొంత ఇబ్బంది అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube