టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక కారణాన్ని వెతుకుతూనే ఉంటారు .ఏదో ఒక అంశం తో ప్రజలలో చర్చ జరిగే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉంటారు.
మొదటి నుంచి ఆయన ఇదే వైఖరి అవలంబిస్తూ వస్తుండడంతో నే, తెలంగాణలో రేవంత్ ఇమేజ్ పెరుగుతూ వస్తోంది.కాంగ్రెస్ అధిష్టానం కూడా టిఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి కాంగ్రెస్ ను తీసుకురాగల సత్తా రేవంత్ కు ఉంది అనే నమ్మకం తోనే, ఆయనకు పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కి కేటీఆర్ ను ఇరుకున పెట్టే చక్కటి అవకాశం లభించింది.ముఖ్యంగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేటీఆర్ పేరు పదే పదే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు.
ఈ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని , అందుకే గోవా వెళ్లారని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.అక్కడితో ఆగకుండా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ తమ పార్టీకి చెందిన జడ్సన్ అనే వ్యక్తితో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు రేవంత్ లేఖ రాయించారు.
ఈ వ్యవహారంలో కేటీఆర్ స్పందించి తమపైన, తమ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేస్తే రాజద్రోహం కేసు పెడతాము అంటూ హెచ్చరించారు.దీంతో కేటీఆర్ భయపడ్డారు అని అందుకే రాజద్రోహం కేసు అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇది ఇలా ఉంటే కేటీఆర్ కు దమ్ముంటే టెస్టులు చేయించుకునేందుకు ముందుకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు.

ఈరోజు తెలంగాణ అమరవీరులు స్తూపం వద్దకు కేటీఆర్ ను రావాలని రేవంత్ సవాల్ విసిరారు.దీంతో కేటీఆర్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.రేవంత్ సవాల్ స్వీకరించి టెస్ట్ కి వెళ్తే ఒక రకమైన ఇబ్బంది , వెళ్లకపోతే మరొక ఇబ్బంది అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉంది.
ఈ డ్రగ్స్ వ్యవహారంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదు అనే విషయాన్ని ఎలా నిరూపించుకోవాలి అనేది తెలియక కేటీఆర్ సతమతం అయిపోతున్నారట.
.