బీజేపీ బట్టలూడదీసి నిలబెడతానంటున్న కేటీఆర్ ! 

కేంద్ర అధికార పార్టీ బిజెపిపై తెలంగాణ ఐటి మంత్రి,  టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.గోల్మాల్ గుజరాత్ మోడల్ చూపెట్టి అధికారంలోకి వచ్చారని, ఎనిమిదేళ్లలో బిజెపి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

45 ఏళ్లలో ఎప్పుడూ లేని నిరుద్యోగం ఇప్పుడు మనదేశంలో ఉందని,  పేదరికంలో నైజీరియాను దాటిపోయింది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఈ విమర్శలు చేశారు.

తెలంగాణలో కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులు ఇంకా ఏ రాష్ట్రంలోనూ చేయలేదని,  తెలంగాణ మోడల్ ను దేశమంతా అమలు చేస్తామని,  ప్రతి ఒక్కరికి తాగునీరు అందించి ఉచిత కరెంటు ను అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు.

       మోడీ ప్రజల మాట వినడని,  ఆయన మాట మాత్రమే చెబుతాడని,  బిల్డప్పు తప్పనేమీ లేదని , అందరికీ ఇళ్లు అంటాడని అవి ఎప్పుడొస్తాయో తెలియదు.ఒకరికి మాత్రం వచ్చాయి ఆయన ప్రపంచంలోనే రెండో పెద్ద కుబేరుడు అయ్యారు.

Advertisement

మోది 435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు.ప్రతి రంగంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అత్యధిక నిరుద్యోగం దేశంలో ఉంది.దేశం ఎక్కడా అభివృద్ధి చెందలేదు.2024 నాటికి అందరికీ ఇల్లు అన్నారు కానీ , మోదీ మాత్రం 435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.భారత్ రాష్ట్ర సమితి రూపంలో దేశ సమస్యలకు తాము పరిష్కారం చూపిస్తామని,  తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని,  కేంద్రమై పార్లమెంట్ లో చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు.రైతుబంధు, రైతు బీమా వంటి అద్భుతమైన పథకాలు రైతు వేదికలు,  రైతు సమితి దేశంలో మరెక్కడా లేవని గుర్తు చేశారు.   

    టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఎన్నో అవమానాలు తమకు ఎదురయ్యాయని,  ఇప్పుడు బిఆర్ఎస్ పెడితే అలాగే మాట్లాడుతున్నారని,  మా అస్తిత్వమే తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలంటే తెలంగాణ పేరుతో వెళ్లడం సాధ్యం కాదు.అందుకే పేరు మార్పు అని,  దేశంలోని వివిధ రాజకీయ నాయకులు రైతు ప్రజాసంఘాల నేతలు ఆర్థిక వేత్తలతో మాట్లాడిన తర్వాతే జాతీయస్థాయిలోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ తెలిపారు.ఈ దేశంలో ఒక దారుణమైన పరిస్థితి ఉందని బిజెపి అంటే గుజరాతీలు నడిపే పార్టీ అని సృజన చౌదరి సీఎం రమేష్ లపై కేసులు ఏమయ్యాయి అని కేటీఆర్ ప్రశ్నించారు.

గత ఎనిమిదేళ్ల అరాచకాలపై బీజేపీ బట్టలు కూడా తీసి నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు