ప్రధానిని ఎలా పిలవాలో ఆప్షన్స్ ఇస్తున్న కేటీఆర్

టిఆర్ఎస్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఒకపక్క చేస్తూనే , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ అనేక విమర్శలు చేస్తోంది.

 Ktr Satirical Tweet On Prime Minister Modi Details, Ktr, Kcr, Telangana, Telanga-TeluguStop.com

తెలంగాణలో తమకు ప్రధాన పోటీదారిగాను బిజెపి బలపడుతుండడంతో పూర్తిస్థాయిలో ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.తెలంగాణ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.

ప్రధానిని మీరు ఎలా పిలుస్తారో తేల్చుకోవాలని నేరుగా ప్రజలకు ఆయన ఆప్షన్లు ఇచ్చారు.దేశంలో చొరబాటు దారులను నియంత్రించలేని ప్రధానమంత్రిని మీరేమంటారు అంటూ సోషల్ మీడియాలో ఆయన ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించింది అంటూ జాతీయ మీడియాలో వచ్చిన ఒక వార్త క్లిప్పింగును సోషల్ మీడియాలో కేటీఆర్ పోస్ట్ చేశారు.శాటిలైట్ ఫోటోల తో సహా ఒక జాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది.దీనిని ప్రస్తావిస్తూ నాలుగు ఆప్షన్లు ప్రజలకు ఇచ్చారు.ఎ)56″ బి ) విశ్వగురు సి) అచ్చేదిన్ వాలే డి) పైవన్ని పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి.అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్విట్ చేశారు.భారత్ లో రోజు రోజుకు ద్రవయోల్బణం పెరిగిపోతోందని కేటీఆర్ కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తుల పైన కేంద్రం జీఎస్టీ ని విధించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.

Telugu Central, China, Kcr National, Milk Gst, Prime India, Telangana, Telangana

దీన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పాల ఉత్పత్తులపై ఎప్పుడు లేని విధంగా పన్నులు విధించారని, బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఆందోళన కార్యక్రమాలో పాడి రైతులు కూడా భాగస్వామ్యం కావాలంటూ కేటీఆర్ కోరారు.అలాగే భారీ వరదలతో తెలంగాణ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా కేంద్రం విడుదల చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు.2020 హైదరాబాద్ వరదలకు ఇప్పుడు గోదావరి వరదలకు కేంద్రం ఎందుకు సాయం చేయడం లేదని, నిధులు విడుదల చేయకపోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube