మహబూబ్ నగర్ కేంద్రంగా అమర్ రాజా కంపెనీ ( Amar Raja Company )తన మలి విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసినదే.దీనికి సంబంధించిన గిగా కారిడార్ కు శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్( KTR ) అమర్ రాజా కంపెనీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశారు .చుక్క పొల్యూషన్ కూడా లేకుండా ఉండే లిథియం అయాన్ బ్యాటరీ తయారీ రంగంలో అతిపెద్ద కంపెనీని ఏర్పాటు చేసినందుకు గల్లా జయదేవ్ ని అభినందించిన కేటీఆర్ఈ కంపెనీ వల్ల పొల్యూషన్ వస్తుందన్న విమర్శల కు తన వాఖ్యల ద్వారా చెక్ పెట్టారు .లిథియం అయాన్ బ్యాటరీ( Lithium ion battery ) తయారీలో పొల్యూషన్ ఉండదని ఈ కంపెనీ చిత్తూరులో పెట్టిన ఫ్యాక్టరీ నుంచి కూడా పొల్యూషన్ వచ్చే అవకాశం లేదని గల్లా కుటుంబం అక్కడే నివాసం ఉంటుందని కావలిస్తే బస్సులను పెట్టుకుని వెళ్లి చెక్ చేసుకోండి అంటూ ఆ కంపెనీ పై వస్తున్న విమర్శలకు కొట్టిపారేస్తూ క్వాలిటి సర్టిఫికేట్ ఇచ్చేశారు.
ఈ కంపెనీ ఏర్పాటును దక్కించుకోవడానికి దాదాపు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపడినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళతర పారిశ్రామిక విధానాలు నచ్చడం వల్లే ఆయన ఇ క్కడ కంపెనీ పెడుతున్నారని తద్వారా మహబూబ్ నగర్ ( Mahbub Nagar )ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వారి జీవన పరిస్థితులు మరింత మెరుగుపడతాయని అని తాను భావిస్తున్నాను అంటూ చెప్పుకోచ్చారు .ఆ కంపెనీ నుంచి వస్తున్న కాలుష్యకారకాల వల్ల ఆ ప్రాంతం నష్టపోతుందని అందువల్ల నోటీసులు ఇస్తే వేధిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఇంతకుముందు ఆంధ్ర మంత్రులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు కెసిఆర్ ప్రకటన ద్వారా అధికార పక్షం తమను వేధింపులకు గురి చేస్తుందన్న కంపెనీ ఆరోపణలు కేటీఆర్ వాఖ్యలు బలపరిచినట్లయింది ….
కంపెనీ యజమాని గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ కావడం, ఆయన జగన్( jagan ) అవినీతి కేసులపై పార్లమెంటు వైదిక గా నిలదీయడంతో ఉద్దేశపూర్వకంగానే తమను ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.మరి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆంధ్ర అధికార పక్ష నేతల ప్రతిస్పందన ఏమిటో చూడాలి
.