ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఒకవైపు సభలు సమావేశాలతో హోరెత్తిస్తూనే మరోవైపు అందుబాటులో ఉన్న మీడియా ఛానల్స్ లో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారాన్ని ఉధృతం చేశారు.దీనిలో భాగంగానే ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఎన్నికలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పిన కేటీఆర్ ఎన్నికల్లో గెలుపోవటములను వ్యూహకర్తలు ఏ మేరకు ప్రభావితం చేస్తారనే అంశంపై కూడా తన అభిప్రాయాన్ని వినిపించారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో బిఆర్ఎస్( BRS party ) తో కలిసి పనిచేసిన ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) బిఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు.
![Telugu Brs, Cm Kcr, Congress, Democracy, Prashant Kishor, Telangana, Ts-Telugu P Telugu Brs, Cm Kcr, Congress, Democracy, Prashant Kishor, Telangana, Ts-Telugu P](https://telugustop.com/wp-content/uploads/2023/11/ktr-Democracy-brs-party-congress-party-ts-politics.jpg)
తన అభిప్రాయం అయితే వ్యూహకర్తలు గెలిపించలేరు, ఓడించలేరు అని కేవలం వారి పార్టీకి కొంత వేల్యూ మాత్రమే యాడ్ చేస్తారని, అయితే ఈ రోజుల్లో ఎన్నికల వ్యూహకర్తలు సమస్త వ్యవహారాలను తామే చక్కబెడతాం అంటున్నారని, ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను కూడా తామే నిర్ణయిస్తాం అంటున్నారని ప్రజాస్వామ్యం( Democracy )లో ఇది ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
![Telugu Brs, Cm Kcr, Congress, Democracy, Prashant Kishor, Telangana, Ts-Telugu P Telugu Brs, Cm Kcr, Congress, Democracy, Prashant Kishor, Telangana, Ts-Telugu P](https://telugustop.com/wp-content/uploads/2023/11/Prashant-Kishor-ktr-Democracy-cm-kcr-brs-congress-party-ts-politics.jpg)
ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎలాంటి హామీలు ఇవ్వాలి? వరకూ పర్లేదు కానీ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా వారే చెప్పేస్తే ఇక ప్రజల మద్దత్తు తో గెలిచిన నాయకులకు విలువ ఏముంటుందని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.తద్వారా ప్రశాంత్ కిషోర్ టీం తో తమకు ఎక్కడ చెడింది అన్న విషయాన్ని కూడా సూచన ప్రాయం గా కేటీఆర్ చెప్పినట్లు అయింది .అయితే రాజకీయాల్లో అధికారంలో ఉన్నంత సేపు బాకా ఊదే వారు ఎక్కువగా ఉంటారని దాని ద్వారా నాయకులు నిజాలు తెలుసుకోలేరవ్యూహకర్తలు అన్న వాళ్ళు తమ ఫలితాలను మిర్రర్లో చూపిస్తారని తద్వారా సరైన విధానంలో వెళ్ళడానికి వీరు కొంత సహాయపడతారని అయితే పూర్తిస్థాయిలో ఫలితాలను తారుమారు చేసే శక్తి వీరికి ఉందని తాను అనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పుకొచ్చారు.