క్షీరాబ్ది ద్వాదశి రోజు విష్ణుమూర్తి.. అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి..!

ముఖ్యంగా చెప్పాలంటే పవిత్రమైన కార్తీక మాసంలో( Karthika Masam ) క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరిస్తారు.

కార్తిక శుక్ల ద్వాదశి( Karthika Shukla Dwadashi ) రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుంచి లేచి మహా విష్ణువు ( Lord Vishnu )సమస్త దేవతల తోడును మునులతోడును లక్ష్మీ తోడును గుడి బృందావనమునకు వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశాడు.

ఏ మానవుడైన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు కాలమున సర్వమునులతో, దేవతలతో గుడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి, తులసి పూజ( Tulsi Puja ) చేసి,తులసి కథను విని భక్తితో దీపా దానము చేస్తాడో అలాంటి వారి సర్వ పాపాలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు.

Ksheerabdi Dwadashi Day Vishnumurthy.. Do This To Get Blessings , Karthika Ma

కాబట్టి ఏ పుణ్యకార్యమైన మొదలు పెట్టిన ఈ వ్రతము తో మొదలు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.ఆ తర్వాత ఈ వ్రతము చేయవలసిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంత్రం సమయంలో తులసి కోటను చక్కగా శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించి లక్ష్మీదేవితో ( Goddess Lakshmi )పాటు శ్రీమహావిష్ణువును కూడా పూజించాలి అలాగే తులసి కోటకు కూడా పూజ చేయాలి.

ఇంకా చెప్పాలంటే నైవేద్యంగా కొబ్బెర బెల్లం ఖర్జూరం అరటి పండ్లు చెరుకు ముక్కలు సమర్పించాలి.అలాగే తాంబూలం పుష్పగుచ్చము పెట్టి పూజ పూర్తి చేసి సమర్పించి పూజ పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీప దాన ఫలమును వినాలి.

Ksheerabdi Dwadashi Day Vishnumurthy.. Do This To Get Blessings , Karthika Ma
Advertisement
Ksheerabdi Dwadashi Day Vishnumurthy.. Do This To Get Blessings , Karthika Ma

ఆ తర్వాత బ్రాహ్మణులకు గంధపుష్ప ఫలాలతో తృప్తి పరిచి వ్రతము ను పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు.అలాగే పేదవారికి దానధర్మాలు చేయడం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు