టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు.
అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.
ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా దూసుకు పోతుంది.
డబ్బింగ్ వెర్షన్ల కలెక్షన్స్ బయటకు రావడంతో ఈ వార్త ఇంటర్నెట్ ను షేక్ చేసాయి.ఇది ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టింది.మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టి ఆర్ ఆర్ ఆర్ పవర్ చూపించింది.
ఈ సినిమా బాలీవుడ్ మీడియా కథనాల పరంగా దాదాపు 710 కోట్లు వసూలు చేసి ఇప్పుడు 1000 కోట్ల మార్క్ టచ్ చేయడానికి పరుగులు పెడుతుంది అని చెబుతున్నారు.

అయితే బాలీవుడ్ వివాదాస్పద విమర్శకుడు కుమార్ ఆర్ ఖాన్ ఈ కలెక్షన్స్ అన్ని తప్పు అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్సాఫీస్ నంబర్ లపై తన మాటలను తెల్పాడు.ఈ నెంబర్స్ అన్ని బూటకం అంటూ కొట్టిపారేశాడు.ఈయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆర్ ఆర్ ఆర్ ఓబోఫిస్ నెంబర్ ల గురించి చెబుతూ.
ఫేక్ కలెక్షన్స్ అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.ఫేక్ రిపోర్టింగ్ చేయిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.ఈ వ్యాఖ్యలతో నెటిజెన్స్ పెద్దగా ఏకీభవించినట్టు అనిపించలేదు.ఈయనపై నెటిజెన్స్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ అభిమానులు మండిపడుతున్నారు.







