మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలదే ఎక్కువగా హవా నడుస్తోందని చెబుతూ ఉంటారు.ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలలో పరిస్థితి ఇదే.
స్టార్ హీరోలు( Star Heroes ) ఉన్నారంటే ప్రేక్షకుడు, థియేటర్ కి వస్తాడనేది చాలామంది బలంగా నమ్మే మాట.అయితే పురుషుల ఆదిపత్యం అలాగే హీరోల హవా పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా హీరోయిన్ కృతిసనన్( Heroine Kriti Sanon ) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇంతకీ ఆమె ఏం చెప్పింది అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.
పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా చూడటానికి ప్రేక్షకులు పరుగెత్తుకుని వచ్చేయరు.కథ బాగుంటే అందులో యాక్టర్స్ ఆడా? మగా? అనేది చూడరు.బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది నిర్మాతలు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్( Heroine Oriented Movies ) అంటే చిన్నచూపు చూస్తున్నారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
హీరోలు లేనప్పటికీ క్రూ మూవీ బాగా ఆడుతోంది.ఇది చూసైనా సరే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అని ఆమె తెలిపింది.
అయితే కృతిసనన్ చెప్పింది నిజమే.ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకులు.
హీరోల కోసం సినిమాలకు వచ్చేవారు.కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ బాగుందా? ఎంటర్ టైన్ మెంట్ ఉందా? ఇలాంటివీ చాలా ఆలోచిస్తున్నారు.
ఇందులో భాగంగా తన క్రూ మూవీ( Crew Movie ) హిట్టయ్యేసరికి కృతి ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరి మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇకపోతే కృతి సనన్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమా( Nenokkadine )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
అలాగే టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ మూవీ( Adipurush ))తో ప్రేక్షకులను పలకరించింది.