Krithi Shetty : లావణ్య త్రిపాఠి బాటలోనే కృతి శెట్టి… బేబమ్మ టాలెంట్ మామూలుగా లేదుగా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ప్రేమలో పడి నిజ జీవితంలో కూడా ఒకటవుతూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నిజజీవితంలో కూడా భార్యాభర్తలుగా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

 Krithishetty On The Way To Lavanya This Is The Clarity-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) సైతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) ను ప్రేమలో పడేసిన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ కలిసి నటించిన మిస్టర్ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం అనే సినిమాలో కూడా నటించారు.అయితే అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ బంధాన్ని అలాగే కొనసాగిస్తూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే ఉన్నఫలంగా తామిద్దరం నిశ్చితార్థం చేసుకోబోతున్నాము అంటూ తెలియచేయడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.ఇలా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఇప్పటికే జరిగింది త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

Telugu Krithi Shetty, Mister, Tollywood, Uppena, Vaishnav Tej-Movie

ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి బాటలోనే మరొక నటి కృతి శెట్టి ( Kriti Shetty ) కూడా నడుస్తున్నారని తెలుస్తోంది.మొదటి సినిమాతోనే బేబమ్మ తన టాలెంట్ మొత్తం చూపిస్తూ మెగా హీరోని ప్రేమలో పడేసింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లులు కొడుతుంది.బేబమ్మ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే ఈమె కూడా మెగా కోడలిగా అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త ఈమె గురించి సంచలనంగా మారింది.కృతి శెట్టి మెగా హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన ( Uppena ) ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

Telugu Krithi Shetty, Mister, Tollywood, Uppena, Vaishnav Tej-Movie

ఈ సినిమా ద్వారా వైష్ణవ్ కృతి శెట్టి ఇద్దరు కూడా హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే వీరిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉన్నట్టు చూపించారు అయితే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఆ ప్రేమను అలాగే కొనసాగిస్తూ వచ్చారని తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.అయితే ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ రహస్యంగా మెయింటైన్ చేస్తూ వచ్చారని కెరియర్ కాస్త గాడిలో పడిన తర్వాత తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Telugu Krithi Shetty, Mister, Tollywood, Uppena, Vaishnav Tej-Movie

ఇలా రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి ఈ జంట ఏ క్షణానైనా తమ ప్రేమ విషయాన్ని అందరికీ తెలియజేయవచ్చు అని కూడా తెలుస్తోంది.ఇలా కృతి శెట్టి వైష్ణవ్ ప్రేమలో ఉన్నారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఈమె కూడా లావణ్య త్రిపాఠి బాటలోనే నడుస్తున్నారంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.మరి కృతి శెట్టి వైష్ణవ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ జంట స్పందించాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube