స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది.
ఈ కేసులో చంద్రబాబుకు జనరల్ మరియు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్లను విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.ఈ క్రమంలోనే సీఐడీ అధికారులను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలను న్యాయస్థానం విననుంది.అయితే ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.







