టాలీవుడ్ పట్టించుకోకపోయినా అక్కడ మాత్రం..!

లేవు లేవంటూనే కృతి శెట్టి ( Krithi Shetty )వరుస సినిమాలతో బిజీ అవుతుంది.ఉప్పెన నుంచి బంగార్రాజు వరకు హ్యాట్రిక్ హిట్లు అందుకున్న అమ్మడు ఆ తర్వాత హ్యాట్రిక్ దాటి ఫ్లాపులు కొనసాగించింది.

 Krithi Shetty Kollywood Chance Vishal Movie, Krithi Shetty , Kollywood , Sharw-TeluguStop.com

ఈ టైం లో కృతికి ఛాన్స్ లు రావడం కష్టమే అనుకున్నారు కానీ కృతి శెట్టికి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.లేటెస్ట్ గా విశాల్ ( Vishal )హీరోగా చేస్తున్న సినిమాలో కృతి శెట్టికి అవకాశం లభించిందట.

తెలుగులో శర్వానంద్(Sharwanand ) తో ఒక సినిమా చేస్తున్న అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఛాన్స్ కొట్టేసింది.

అసలైతే సూర్య 41వ సినిమాలో ముందు కృతి నే హీరోయిన్ గా అనుకున్నారు.కార్తీ హీరోగా వస్తున్న ఒక సినిమాకు కృతిని అనుకుని చివర్లో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు.కానీ విశాల్ మాత్రం కృతి శెట్టికి ఆఫర్ ఇచ్చారట.

పాండిరాజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.విశాల్ సినిమా అంటే తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ ఉంటుంది.

సో కృతి శెట్టికి తెలుగులో రాకపోయినా తమిళంలో మొదటి సినిమా ఖాతా తెరిచినట్టే అని చెప్పొచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube