వరుస ఫ్లాప్స్.. ఐరన్ లెగ్ పేరు.. అయినా అవకాశాలు.. కృతిశెట్టి రేంజ్ అది!

టాలీవుడ్ హీరోయిన్ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి మనందరికీ.ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కృతి శెట్టి.

 Krithi Shetty Getting Offers Despite Of Flops Details, Krithi Shetty, Flops, Tol-TeluguStop.com

మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

ఇక ఉప్పెన సినమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.హీరో వైష్ణవ తేజ్ కి, హీరోయిన్ కృతి శెట్టికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

అలా ఈమెకు ఉప్పెన సినిమా తరువాత వరుసగా అవకాశాలు అందడంతో పాటు ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు కాకకముందే కృతి శెట్టి నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇక అందులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు సొంతం చేసుకున్నాయి.

కానీ ది వారియర్, మాచర్ల నియోజకవర్గం,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.దీంతో ఈమెకు వరుసగా మూడు ఫ్లాప్ లు ఎదురయ్యాయి.

దీంతో కృతి శెట్టి కెరియర్ ఏమవుతుందో అని అభిమానులు సందేహపడ్డారు.కానీ వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఏమాత్రం తగ్గడం లేదు.

కానీ తెలుగులో కాకుండా ఈమెకు ఇతర భాషల్లో వరుసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Bangarraju, Flops, Iron Leg, Krithi Shetty, Nagachaitanya, Surya, Tivino

ఇప్పటికే ఈమె తమిళంలో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.అందులో ఒకటి నాగచైతన్య సినిమా కాగా మరొకటి సూర్య హీరోగా నటిస్తున్న సినిమా.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈమె మలయాళం లో కూడా ఒక సినిమా అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

యువ కథానాయకుడు టొవినో థామస్ సరసన నటించిన అవకాశాన్ని దక్కించుకుంది కృతి శెట్టి.అజయంటే రాండం మోషనం అనే సినిమాలో నటిస్తోంది.అయితే సినిమాలో వరసగా ఫ్లాప్ అవుతున్న కృతి శెట్టి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube