సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలో బ్రతికే ప్రతి ఒక్క నటీనటుల పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.
కొందరు వీటిని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారు.మరికొందరు వీటిని ఎంతో సీరియస్ గా తీసుకొని తమను ట్రోలింగ్ చేసిన వారికి తమదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటారు.
ఇకపోతే ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయి మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన హిట్ కొట్టిన కృతి శెట్టి ఇందుకు మినహాయింపు కాదు.
ఈమె పై కూడా నిత్యం నెటిజనులు ఏదో విధంగా తనని ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే తాజాగా ఈమె గురించి కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి.కృతి శెట్టి యంగ్ హీరోతో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలపై స్పందించిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.తనకింకా ప్రేమించే వయసు రాలేదని ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరియర్ పై ఉందని తెలియజేశారు.
అదేవిధంగా తన గురించి వస్తున్న గాస్సిప్స్ గురించి కూడా కృతి శెట్టి స్పందించారు.

గాస్సిప్స్ ను లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాను.నేనేంటో నాకు తెలుసు… నాకు ఎలాంటి సినిమాలు ఇవ్వాలో దర్శకులకి తెలుసు మరి అలాంటప్పుడు గాసిప్స్ గురించి పట్టించుకోవడం దేనికి అంటూ ఈమె తన పై వచ్చే గాసిప్స్ గురించి స్పందించారు.ప్రస్తుతం ఈమె లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ది వారియర్ సినిమాలో నటించారు.
అదేవిధంగా బాల దర్శకత్వంలో సూర్య సినిమాతో కృతి శెట్టి బిజీ కానున్నారు.







