ఆ వంట వండటంలో రమ్యకృష్ణ స్పెషలిస్ట్.. కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!

ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరైన రమ్యకృష్ణ ( Ramyakrishna ) చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న ఈ నటి ప్రస్తుతం తక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు.

 Krishnavamsi Comments About Ramyakrishna Details, Krishnavamsi, Ramyakrishna, Ra-TeluguStop.com

రంగమార్తాండ( Rangamarthanda ) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ కథ నచ్చితే ఏ పాత్రను అయినా అద్భుతంగా పోషిస్తూ తన నటనతో మెప్పించడం ద్వారా ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా కృష్ణవంశీ ( Krishnavamsi ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చికెన్ వండటంలో రమ్యకృష్ణ స్పెషలిస్ట్ అంటూ కృష్ణవంశీ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.కొర్ర మీనులు అంటే తనకు ఎంతో ఇష్టమని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

ఇగురును సైతం ఎంతో ఇష్టంగా తింటానని ఆయన అన్నారు.రమ్యకృష్ణ చికెన్ ను చాలా టేస్టీగా సిద్ధం చేస్తుందని కృష్ణవంశీ పేర్కొన్నారు.

రమ్యకృష్ణ చాలా తక్కువ సందర్భాల్లో వంట చేస్తుందని అయితే ఆ వంటకాలు రుచిగా ఉంటాయని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.ఎంతో ఇష్టంతో రమ్యకృష్ణ వంట చేస్తుందని అందుకే ఆ వంటకాలు ఇంత రుచిగా ఉంటాయని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ నటించడం వల్ల ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

రంగమార్తాండ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.కృష్ణవంశీకి స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడంసులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.కృష్ణవంశీ తర్వాత ప్రాజెక్ట్ అన్నం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

అయితే ఈ సినిమా వల్ల కృష్ణవంశీ రెమ్యునరేషన్ మాత్రం పెరిగే ఛాన్స్ ఉంది.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube