మహేష్( Mahesh Babu ) కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మురారి.( Murari ) 2001లో వచ్చిన ఈ సినిమా మహేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడేలా చేసింది.
మహేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా ఇదే.అయితే ఈ సినిమా సూపర్ హిట్ కాగా ఈమధ్య కృష్ణవంశీ( Director Krishna Vamsi ) మురారి సీక్వెల్ ఆలోచన ఉన్నట్టు చెప్పుకొచ్చారు.మురారి పార్ట్ 2 తీస్తే అందులో మహేష్ చేస్తాడా లేదా అన్నది డౌటే.ఒకవేళ అన్నీ కరెక్ట్ గా కుదిరితే మహేష్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది.కానీ మురారి 2లో మహేష్ కాకుండా మరో హీరోతో కృష్ణవంశీ ప్రయోగానికి రెడీ అయ్యారట.
అయితే పార్ట్ 2 మహేష్ కాకుండా వేరే హీరోతో చేస్తే వర్క్ అవుట్ అవుతుందా కాదా అన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారట.మురారి 2 తీస్తే మహేష్ తోనే చేయాలి అది కూడా కృష్ణవంశీ ఒక మంచి కథతో ఈ సినిమా తీయాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.మహేష్ ప్రస్తుతం అసలేమాత్రం ఫాం లో లేని కృష్ణవంశీతో సినిమా చేస్తాడని అనుకోలేం.
అది చాలా కష్టం కూడా.మరి మురారి 2 అసలు ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.