గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, చందమామ వంటి అద్భుతమైన సినిమాలను తీసి తెలుగు ప్రేక్షకుల్లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ.ఈ విలక్షణమైన దర్శకుడు మంచి సినిమాలు తీసినా వాటిలో కొన్ని కమర్షియల్‌గా హిట్ కాలేదు.
ఉదాహరణకి సింధూరం మూవీ విప్లవాత్మక స్టోరీతో వచ్చింది.ఈ సినిమా చాలా బాగుంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇందులో రవితేజ, సౌందర్య, బ్రహ్మాజీ, సంఘవి నటించారు.ఈ చిత్రం తెలుగులో బెస్ట్ మూవీ గా నేషనల్ అవార్డును అందుకుంది.
అంతేకాదు, ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.కానీ ఈ మూవీ వల్ల ప్రొడ్యూసర్ నష్టపోయాడు.
ఈ అపజయంతో కృష్ణ వంశీ( Krishna Vamsi ) మళ్లీ ఐదేళ్లు అలాంటి ప్రయోగాత్మక సినిమా జోలికి వెళ్ళలేదు.

కృష్ణ వంశీకి దేశభక్తి చాలా ఎక్కువ.అందుకే 2002లో “ఖడ్గం” ( Khadgam )మూవీ చేశాడు.ఖడ్గంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, సంగీతా క్రిష్, కిమ్ శర్మ నటించారు.
దీనిని కార్తికేయ మూవీస్ పతాకంపై( Karthikeya Movies banner ) సుంకర మధు మురళి నిర్మించారు.కృష్ణవంశీ 1990 కాలంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబైలో చేసిన ఉగ్రదాడిని ఇన్‌స్పిరేషన్ గా తీసుకుని ఈ మూవీ తీసాడు.
ఈ మూవీ నటీనటుల సెలక్షన్ విషయంలో కృష్ణవంశీ చాలానే సవాళ్లను ఎదుర్కొన్నాడు.ముఖ్యంగా శ్రీకాంత్ ను ఎంపిక చేసుకోవడం నిర్మాత మధు మురళికి అసలు ఇష్టం లేదు.
ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్‌గా శ్రీకాంత్‌ని కృష్ణవంశీ సెలెక్ట్ చేసుకున్నాడు.

దీని గురించి తెలిసి “శ్రీకాంత్ మొన్నటిదాకా ఫ్యామిలీ, కామెడీ సినిమాలు తీశాడు, అతడు ఆ క్యారెక్టర్ కు అసలు సూట్ కాడు, అతడిని కాకుండా వేరే నటుడిని తీసుకోండి.” అని కృష్ణవంశీకి నిర్మొహమాటంగా చెప్పేశాడు.కానీ కృష్ణవంశీ శ్రీకాంత్ తప్ప ఈ పాత్రకు ఎవరూ సరిగ్గా సూట్ కారు అని తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పేసాడు.ఆ సమయంలో నిర్మాత “నీకు నేను రెండు కోట్లు ఇస్తా, శ్రీకాంత్ ని కాకుండా వేరే నటుడిని పోలీస్ పాత్రకు సెలెక్ట్ చేయి.” అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.కానీ కృష్ణవంశీ ఆ రెండు కోట్లకు ఆశపడలేదు.తాను ముందుగా అనుకున్నట్లే శ్రీకాంత్ నే నటింపజేశాడు.కట్ చేస్తే శ్రీకాంత్ పాత్ర బాగా హైలెట్ అయింది.ఆ పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించాడు.
కృష్ణవంశీ నమ్మకాన్ని నిలబెట్టాడు.అప్పట్లో నిర్మాత రెండు కోట్ల ఆఫర్ చేయడం, డైరెక్టర్ దాన్ని సింపుల్ గా వదిలేసి చివరికి అతడే విజయం సాధించడం చర్చనీయాంశం అయ్యింది.