నిన్నే పెళ్లాడతా సినిమా క్లైమాక్స్ వెనక ఇంత పెద్ద కథ ఉందా ?

1996 లో కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన సినిమా నిన్నే పెళ్లాడతా.ఈ సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకొని అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

 Krishna Vamsi About Ninne Pelladatha Climax ,krishna Vamsi,tabu,nagarjuna,ninne-TeluguStop.com

సింధూరం సినిమా తో తన మార్కు ఏంటో చూపించుకొని వరస సినిమాలకు దర్శకత్వం వహించి, మంచి విజయాలను తన సొంతం చేసుకున్నాడు కృష్ణ వంశీ.నాగార్జున వంటి హీరో తో నిన్నే పెళ్లాడతా సినిమా తీసి మరొక అద్భుతమైన చిత్రాన్ని అభిమానులకు అందించాడు.

కృష్ణ వంశీ కథ చెప్పిన వెంటనే తానే నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు నాగార్జున.

Telugu Audience, Krishna Vamsi, Nagarjuna, Ninnepelladatha, Shiva, Tabu, Tollywo

ఈ సినిమా విడుదల అయ్యాక మ్యూజికల్ గా చాల పెద్ద హిట్ అయ్యింది.మాములుగా నాగార్జున కి శివ సినిమా బాగా పెద్ద హిట్ అయ్యింది.ఆ తర్వాత అంత స్థాయి హిట్ అందుకోవడం లో నాగార్జున చాల ఏళ్ళ పాటు పరాజయాలు చవి చూసాడు.

శివ స్థాయి విజయం అందుకోవడానికి నాగార్జున కి చాల కష్టం అవుతున్న సమయం లో నిన్నే పెళ్లాడతా సినిమా నాగార్జున కెరీర్ లో అతి పెద్ద విజయం గా నిలిచింది.గులాబీ సినిమా చేస్తున్న సమయంలోనే కృష్ణ వంశీ ని తన సినిమాకు డైరెక్ట్ చేయమని నాగార్జున రిక్వెస్ట్ చేయడం తో కృష్ణ వంశీ అందుకు ఒకే చెప్పాడు.

రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఉన్న కృష్ణ వంశీ కి ఈజీ గానే నాగార్జున తో రాపో పెంచుకున్నాడు.

Telugu Audience, Krishna Vamsi, Nagarjuna, Ninnepelladatha, Shiva, Tabu, Tollywo

ఇక సినిమా మొత్తం లవ్ మరియు కుటుంబ నేపథ్యం లో తెరకెక్కడం తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.ఇక క్లైమాక్స్ తీయడానికి అంత ఒకే చేసుకున్న సమయం లో నాగార్జున కృష్ణ వంశీ ని పిలిచి ఒక సారి క్లైమాక్స్ ఎలా తీయాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు.మొత్తం విన్నాక క్లైమాక్స్ మార్చేయాలని చెప్పాడు.

సినిమా మొత్తం లైటర్ వే లో ఉన్న టైం లో సీరియస్ గా క్లోజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం తో మామూలుగానే ఎవరి మాట విని కథ మార్చడం ఇష్టం లేని కృష్ణ వంశీ రాత్రికి రాత్రి ఒక క్లైమాక్స్ రెడీ చేసి పొద్దున్నే నాగార్జున కి చెప్పి మరి ఒకే చేయించుకొని తీసాడట.ఆలా క్లైమాక్స్ మార్చడం వల్లనే సినిమా హిట్ అయ్యింది అంటూ కృష్ణ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube