Serial Actress Prerana: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. ఈ జోడీ అదుర్స్ అనేలా ఉందంటూ?

ప్రస్తుతం పెళ్లిలో సీజన్ నడుస్తుండడంతో ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు( Varun Lavanya ) మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.

అలాగే బిగ్ బాస్ నటుడు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ పెళ్లి కూడా జరగనుంది.ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవ్వగా తాజాగా మానస్( Manas ) తల్లి సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే.

అందులో కుటుంబ సభ్యులు అందరూ కలిసి మానస్ ను పెళ్ళికొడుకు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరో తెలుగు సీరియల్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కింది.ఇటీవలె నిశ్చితార్థం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.ఆ తెలుగు హీరోయిన్ మరెవరో కాదు.

Advertisement

కృష్ణా ముకుందా మురారి( Krishna Mukunda Murari ) సీరియల్ హీరోయిన్ కృష్ణ అలియాస్ ప్రేరణ.( Prerana ) ఈమె పుట్టింది హైదరాబాదులోనే అయినప్పటికీ పెరిగింది మాత్రం బెంగళూరులో.

యాక్టింగ్ పై మక్కువతో కన్నడలో పలు సినిమాలలో కూడా నటించింది.ఇక తెలుగులో కృష్ణ ముకుందా మురారి సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ప్రేరణ.

అందులో చిలిపి చిలిపి పనులు చేస్తూ మంచి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ప్రేరణ, శ్రీపాద( Prerana Sripada ) అనే ఒక కుర్రాడిని పెళ్లి చేసుకుంది.గత నెల అక్టోబర్ చివరిలో నిశ్చితార్థం చేసుకున్న ప్రేరణ తాజాగా కన్నడ సంప్రదాయం ప్రకారం శ్రీపాద ని పెళ్లి చేసుకుని ఏడడుగులు వేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆ జంట చూడడానికి చాలా చూడముచ్చటగా ఉండడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

నైస్ జోడి,క్యూట్ కపుల్, సూపర్ జోడి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు