అన్నగారు నందమూరి తారక రామ రావు గారు( Sr NTR ) సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయంలో కృష్ణ గారి రంగ ప్రవేశం జరిగింది.కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సి వస్తుంది కాబట్టి హీరో ల మధ్య ఎప్పుడు పోటీ వాతావరణం ఉండేది.
అందువల్ల ఒకే సంవత్సరం ఎన్టీఆర్ నాలుగు సినిమాలను విడుదల చేసి నాలుగు చిత్రాలు కూడా విజయం సాధించడం తో అందరి దృష్టి అన్నగారిపై పడింది.ఈ నాలుగు సినిమాల్లో శ్రీకృష్ణ తులాభారం( Sri Krishna Tulabharam ) వంటి అద్భుతమైన సినిమా కూడా ఉంది.
అయితే ఈ విషయం తెలిసిన కృష్ణ ( Hero Krishna ) అన్నగారు నాలుగు సినిమాలు తీస్తే మనం 8 సినిమాలు చేద్దాం అని తలిచారు.

అనుకున్నదే తడవుగా ఒక పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు.ఈ ఏడాది మేము ఎనిమిది సినిమాలు తీయాలని అనుకుంటున్నాం అని చెప్పారు.అంతే కాదు అందులో నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదల చేస్తాం అని కూడా చెప్పారు.
అప్పటికే కథలు, దర్శకులు ఎవరు కూడా ఖరారు కాలేదు.ఎలాంటి కథ మొదలు పెట్టకుండానే ఎనిమిది సినిమాలు అని ప్రకటించడం పై అప్పట్లో పెద్ద సంచలనం అనే చెప్పాలి.
ఈ విషయం తెలిసి అన్నగారు కూడా నవ్వుకున్నారట.నేను నాలుగు చేయడానికే కింద మీద పడుతుంటే ఎనిమిది ఎలా చేస్తాడో చూడాలి అనుకున్నారు.
అనుకున్నట్టుగానే కృష్ణ గారు కథలను ఎంపిక చేయడం వాటికీ దర్శకులను మిగతా నటులను త్వరత్వరగా సెలెక్ట్ చేయడం కూడా జరిగిపోయాయి.కృష్ణ గారి కోరిక మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సినిమా విడుదల అవుతుంది.

అలాగే సంక్రాంతి ఒక్క రోజే మూడు సినిమాలు విడుదల చేసారు.అందులో ఒక చిత్రం కృష్ణ గారి సతీమణి విజయ నిర్మల దర్శకత్వం వహించారు.ఇక అయన ఆ యేడు నటించిన 8 సినిమాల్లో 7 సినిమాలు విజయం సాధించడం విశేషం.అది కృష్ణ గారి సవాల్ అంటే.అందరు నవ్వినప్పుడు ఏమాత్రం సహనం కోల్పోకుండా అనుకున్న విధంగానే ఎనిమిది సినిమాలు తీసి చూపించారు.అన్నగారు కూడా ఈ విషయం తెలిసి సంతోష పడ్డారట.
ఇక కృష్ణ గారు ఆ టైం నుంచి సినిమాలు చాల ఫాస్ట్ గా విడుదల చేయడం మొదలు పెట్టారు.