తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్లకు కూడా ఎంతో మంచి గుర్తింపు ఉందని చెప్పాలి.ఇలా లేడీ కమెడియన్స్ కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కోవై సరళ( Kovai Sarala ) ఒకరు.ఈమె 1979లో ఆర్.కృష్ణా డైరెక్షన్లో వచ్చిన’ వెళ్లి రత్నం‘ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడంతో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అయ్యారు.ఇండస్ట్రీలో ఎక్కువగా నటుడు బ్రహ్మానందం( Brahmanandam ) తో కలిసి ఎన్నో సినిమాలలో భార్యాభర్తలుగా నటించారు.వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి.
ఈ విధంగా తెలుగు తమిళ భాష చిత్రాలలో( Tollywood ) నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారు.ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే ఇప్పటికీ కోవై సరళ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.</b

ఈమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం లేకపోలేదు చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నటువంటి కోవై సరళ సినిమాలలో నటిస్తూ తన తోబుట్టువులను గొప్ప గొప్ప చదువులు చదివిస్తూ వారికి పెళ్లి చేసి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు.ప్రస్తుతం ఈమె తోబుట్టువులందరూ కూడా విదేశాలలో స్థిరపడి తమ పిల్లపాపలతో ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించినది మొత్తం వారి కోసమే ఖర్చు చేశారు అయితే ఉన్న ఆస్తులు కూడా వారికి వాటా రావాలి అంటూ తన తోడబుట్టిన వారు ఈమె సంపాదించిన ఆస్తి విషయంలో కూడా కోర్టుకు వెళ్లారు.</b

వారికోసం ఈమె ఎంతో కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసి ఇండస్ట్రీలో కష్టపడుతూ వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టిన కోవే సరళ విషయంలో తోడబుట్టిన వారు మోసానికి పాల్పడుతూ చివరికి ఆస్తిలో కూడా వాటా కావాలి అంటూ కోర్టుకు వెళ్లి ఈమెను దారుణంగా మోసం చేశారు.వారి కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఈమె పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం ఈమె గురించి ఆలోచించేవారు ఎవరూ లేకపోవడంతో ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.ఇక ఈమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని చెప్పాలి.
ఇలా అవకాశాలు లేక అయిన వారు కూడా తనని దూరం పెట్టడంతో కోవే సరళ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.