ఈ మధ్య తెలుగు లో రీమేక్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.రీమేక్ సినిమాల్ని తెలుగు లో ఎక్కువ గా చేసే హీరో లు ఎవరు అంటే అది చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్( Chiranjeevi, Venkatesh, Pawan Kalyan ) అనే చెప్పాలి.
చిరంజీవి అయితే ఈ మధ్య వరుస రీమేక్ సినిమాలు చేస్తున్నాడు.లూసిఫర్ సినిమాని గాడ్ ఫాదర్ పేరు తో రీమేక్ చేసాడు.
ఈ సినిమా ప్లాప్ అయింది ఇక దాని తరువాత మధ్యలో వాల్తేరు వీరయ్య గా స్ట్రైట్ సినిమా తీసినప్పటికి మళ్లీ రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ప్లాప్ ని మూటగట్టు కున్నాడు.ఈ సినిమా తమిళ్ వేదలమ్ సినిమా కి రీమేక్ గా వచ్చింది.
ఇక ఈయన తర్వాత వెంకటేష్ కూడా నారప్ప సినిమా( Narappa movie ) ని రీమేక్ చేసాడు.ఈ సినిమా తమిళం లో ధనుష్ చేసిన అసురన్ సినిమాకి రీమేక్ గా వచ్చింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.ఇక ఈ సినిమా తర్వాత దృశ్యం 2 సినిమాతో మరోసారి రీమేక్ తో వచ్చాడు వెంకీ ఇది మంచి హిట్ అందుకుంది.
ఇక వీళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రీమేక్ సినిమాలని ఎక్కువ గా చేస్తాడు.ఎందుకంటే ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీ గా ఉన్నాడు కాబట్టి రీమేక్ సినిమాలు చేస్తున్నాడు.
అయితే ఈయన ఇయర్ కి ఒక రీమేక్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ భీమ్లా నాయక్ ( Bhimla Naik )చేస్తే, ఈ ఇయర్ బ్రో సినిమాతో వచ్చారు అయితే ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ లే కావడం విశేషం అయితే ఈ హీరో లు ఇప్పుడు అనే కాదు ఇంతకు ముందు కూడా వీళ్లు చాలా సినిమాలే రీమేక్ చేసారు.రీమేక్ లు చేయడం తప్పుకాదు కానీ ప్రస్తుతం మన తెలుగు డైరెక్టర్స్ కూడా చాలా బాగా సినిమాలు తీస్తున్నారు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుటుంది కదా వాళ్ళు కూడా మంచి కథలు రాస్తున్నారు అని ట్రేడ్ పండితులు అభిప్రాయం పడుతున్నారు…
.