తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్,( Srikanth ) రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ( Shivani Rajasekhar )ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోటబొమ్మాలి పీఎస్.( Kotabommali Movie ) ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్రలో నటించింది.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు.ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు.ఉత్కంఠను కలిగించే కథనంతో వస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.సెన్సార్ అధికారులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో చిత్రబృందం సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉంది.ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటం, ఇందులో అందుకు సంబంధించిన పాయింట్ ఉండటం సినిమాకు మరింత ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలోని పాటలు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అని నెటిజెన్స్ అలాగే మూవీ మేకర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
మొత్తానికి ఈ సినిమా సూపర్ గా ఉందని, ఈ సినిమాతో శ్రీకాంత్ ( Srikanth )కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.విడుదల తేదీకి కేవలం మరో మూడు రోజులు సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.మరి భార్య అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ కోటబొమ్మాలి పిఎస్ సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుందో చూడాలి మరి.