కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ కొరటాల శివ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమాకు సంబంధించి గతంలో రీ షూట్ జరిగాయని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై కొరటాల స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కొరటాల సినిమా రీషూట్ చేస్తే చాలా మంది అదొక పెద్ద తప్పుగా భావిస్తారు.
అలా ఎందుకు భావిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.ఒక సినిమా రీ షూట్ చేసాము అంటే ఒక మంచి ఆలోచన దర్శకుడికి రావడం, ముందు తీసిన సీన్ కన్నా, మంచి సీన్ చేయడం కోసమే రీ షూట్ చేస్తారు.

ఒక సన్నివేశం తప్పుగా వచ్చిందని తెలిసి దానిని అలాగే వదిలేయడం తప్పు.థియేటర్ కి వచ్చి సినిమాను చూసిన ప్రేక్షకులు 100% సంతృప్తిగా వెళ్లడమే మా ధ్యేయం.అలా ప్రేక్షకులను సంతృప్తి పొందడానికి రీ షూట్ చేయడంలో ఏ మాత్రం తప్పు లేదని కొరటాల వెల్లడించారు.అలాంటివి చేయాల్సి వస్తే నిర్మాతలను ఒప్పించి ముందుకు వెళ్తామని కొరటాల ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇకపోతే ఆచార్య సినిమా రీషూట్ చేశామని వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని, అలా చేయాల్సి అవసరం మాకు రాలేదని, ఈ సందర్భంగా కొరటాల శివ ఈ సినిమా రీ షూట్ పై స్పందించారు.







