మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ.వరంగల్ లో కేటీఆర్ పర్యటన ను ఉద్దేశించి ఆమె అనేక అంశాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, కెసిఆర్ పైన అనేక ప్రశ్నలు సంధించారు.
అసలు వరంగల్ లో ఎక్కడ అభివృద్ధి చేశారో కేటీఆర్, కేసీఆర్ లు చూపించాలని సురేఖ డిమాండ్ చేశారు.వరంగల్ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి.
ఈ సామానులు ఏమన్నా ఉంటే లోపలకి తీసుకువెళ్ళండి వాటిని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసేలా ఉన్నారు అంటూ కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి సురేఖ విమర్శలు చేశారు.శంకుస్థాపన లేదు .మన్ను లేదు అని నయవంచన పునర్ స్థాపన ! మోసానికి శంకుస్థాపన అంటూ కేటీఆర్ పై విమర్శలు చేశారు.
వరంగల్ లో టెక్స్ట్ టైల్స్ పార్క్ కు గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేశాడు అంటూ గుర్తు చేశారు.
అప్పుడు వాళ్ల నాయన శంకుస్థాపన చేసిన టెక్స్టైల్ పార్క్ ఇదే .వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఉంది కదా … దానికి భయపడి ప్రజల దృష్టి మరల్చడానికి చేసిన శంకుస్థాపన మళ్ళీ చేస్తున్న కేటీఆర్ అంటూ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.సిగ్గులేని తనానికి నిలువెత్తు రూపం కేసీఆర్ అతని దోపిడి కుటుంబం అంటూ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.చేసిన శంకుస్థాపన మళ్లీ చేస్తావా ముఖానికి సిగ్గుండాలి కేటీఆర్ అంటూ తనదైన శైలిలో సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ కుటుంబం డీఎన్ఏలో నయవంచన, మోసం ఉందని మీ నాయన ఇదివరకు ఇదే టెక్స్ టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేసింది మర్చిపోయావా ? పట్టపగలు నిస్సిగ్గు నాటకాలు అంటూ సురేఖ విమర్శలు చేశారు.
