జగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి కొండా సురేఖ ? వైసీపీ హ్యాపీ 

ఒక్కడిని ఎదుర్కొనేందుకు ఎంత మంది వచ్చినా,  ఎన్ని పార్టీలు కలిసి మూకుముడిగా తనను ఎదుర్కొనేందుకు వచ్చినా, తాను భయపడనని , ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరుతానని పదే పదే వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు.

  టిడిపి,  జనసేన, బిజెపి ,కాంగ్రెస్ ఇలా ఎంతమంది వచ్చినా తమ విజయాన్ని ఆపలేరని,  తాము ప్రజలకు మంచి చేశామని, ఆ మంచే తమను మళ్ళీ అధికారంలో కూర్చోబెడుతుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు.

ఇక ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన జగన్ సోదరి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన అన్నకు వ్యతిరేకంగా గళం విప్పుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఇవి వైసిపికి,  జగన్ వ్యక్తిగత జీవితానికి బాగా డామేజ్ కలిగిస్తున్నాయి.

అయితే ఎన్నికల సమయంలో ఈ తరహా విమర్శలు సర్వసాధారణమైనవేనని , ప్రజల్లో వైసిపి ఉందని,  ఇప్పటి వరకు జరిగిన మంచిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకంతో వైసిపి ఉంది .ఇక ఈ నేతలు చాలదు అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నాయకులు కొంతమంది ,మంత్రులు , ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారానికి తాము చేద్దామనే సంకేతాలు ఇస్తున్నారు .

ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) హయంలో కీలకంగా వ్యవహరించిన కొండ సురేఖ ప్రస్తుత తెలంగాణ లో మంత్రిగా ఉన్నారు.జగన్  అత్యంత సన్నిహితరాలుగా గుర్తింపు పొందరు అయితే ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని కొండా చెబుతున్నారు.దీనిలో భాగంగానే ఏపీలో కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కొండా సురేఖ ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించి, జగన్ పై విమర్శలు చేసేందుకు సైతం కొండ సురేఖ సిద్ధమవుతున్నారు.అయితే ఇప్పటికే షర్మిల చేస్తున్న విమర్శలు వైసీపీని బాగా డామేజ్ చేస్తూ ఉండగా.

  ఇప్పుడు కొండా సురేఖ కూడా తోడైతే మరింతగా వైసీపీకి , జగన్ కు డామేజ్ తప్పదనే అభిప్రాయాలు ఉండగా,  వైసీపీ మాత్రం కొండా సురేఖ రాకను స్వాగతిస్తున్నాయి.

 కొండా సురేఖ ఎంతగా విమర్శలు చేస్తే అంతగా తమకు కలిసి వస్తుందని , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చంద్రబాబుకు అనుకూలంగా అక్కడ మంత్రులను,  ఇతర కేలక నాయకులను ఏపీకి పంపిస్తున్నారనే సానుభూతి పొందేందుకు తమకు అవకాశం ఏర్పడుతుందని, ప్రజలలోను ఈ విషయంపై చర్చ జరుగుతుందని , అంతిమంగా ఎన్నికల్లో తమకే లబ్ధి చేకూరుతుందనే నమ్మకంతో వైసిపి ఉంది .అందుకే కొండా సురేఖ రాకను తాము స్వాగతిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు