పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు( Parliament Budget Session ) కొనసాగుతున్నాయి.ఈ మేరకు కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Droupadi Murmu ) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ఇది తన మొదటి ప్రసంగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని పేర్కొన్నారు.
జీ 20 సమావేశాలు విజయవంతం అయ్యాయన్న ఆమె ఆ సమావేశాలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించామని తెలిపారు.
ఆసియా క్రీడల్లో వందకు పైగా మెడల్స్ సాధించామన్నారు.అటల్ సేతు నిర్మించామన్న ద్రౌపది ముర్ము లక్షల్లో ఉద్యోగాలు కల్పించామన్నారు.దేశంలో 5జీ నెట్ వర్క్( 5G Network ) విస్తరించామన్నారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన దేశం భారత్ అని కొనియాడారు.అలాగే డిజిటల్ స్పేస్( Digital Space ) ను బలోపేతం చేశామని తెలిపారు.
రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు.