శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అన్నారు.జనవరి 26న కర్తవ్యపథ్ లో నారీశక్తి( Nari Shakti ) ఇనుమడించిందని పేర్కొన్నారు.
నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరన్నారు.
బడ్జెట్ సమావేశాల( Budget Sessions ) సందర్భంగా ఎంపీలు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుందని తెలిపారు.దేశం వృద్ధిలో ముందుకు వెళ్తోందన్న మోదీ తమ ప్రభుత్వానికి ప్రజాదరణ ఉందని వెల్లడించారు.ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చెంది తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.
.