అఖిల్ సినిమా వద్దని చెప్పినా వినలేదు.. కోనవెంకట్ సంచలన వ్యాఖ్యలు?

వి.వి.వినాయక్ సినీ కెరీర్ లో కొన్ని డిజాస్టర్లు ఉన్నా వినాయక్ పేరు పోగొట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు అఖిల్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 20 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.అక్కినేని అఖిల్ ఈ సినిమాలో హీరోగా నటించగా వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.

 Kona Venkat Sensational Comments About Akhil Movie Details, Akhil Movie, Kona Ve-TeluguStop.com

ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన కోన వెంకట్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నేను 100 సినిమాలు అనుకుంటే నా సక్సెస్ రేట్ 70 కంటే ఎక్కువని కోనవెంకట్ తెలిపారు.గల్లీ రౌడీ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిందని ఆయన అన్నారు.

మన సక్సెస్ రేట్ ను బట్టి నమ్మకం ఏర్పడుతుందని కోన వెంకట్ కామెంట్లు చేశారు.

వినాయక్ తో అదుర్స్ సినిమాకు పని చేశానని కోన వెంకట్ తెలిపారు.

Telugu Adhurs, Akhil, Akkineni Akhil, Vv Vinayak, Ginna, Kona Venkat-Movie

అఖిల్ మూవీ చేయవద్దని వినాయక్ కాళ్లు పట్టుకోవడం ఒకటే తక్కువ అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.ఆ సినిమా కథలో ఏదో తేడా కొడుతుందని నేను చెప్పానని నేను చెప్పితే వినకపోవడంతో చాలామందితో చెప్పించానని కోన వెంకట్ కామెంట్లు చేశారు.బాబీతో కూడా నేను వినాయక్ కు చెప్పించానని కోన వెంకట్ పేర్కొన్నారు.

Telugu Adhurs, Akhil, Akkineni Akhil, Vv Vinayak, Ginna, Kona Venkat-Movie

నా హార్ట్ కు క్లోజ్ అయిన వ్యక్తులలో వినాయక్ ఒకరు అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నేను నమ్మిన ప్రాజెక్ట్ లను నేను చేస్తున్నానని ఆయన అన్నారు.శ్రీనువైట్ల సినిమాలకు సూర్య కో డైరెక్టర్ అని జిన్నా సినిమాతో సూర్య దర్శకుడిగా పరిచయం కానున్నారని కోన వెంకట్ తెలిపారు.

జిన్నా సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కోన వెంకట్ నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube