మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికకు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ ను వీడిన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తోందన్న కోమటిరెడ్డి.
ప్రాణం ఉన్నంతవరకు మునుగోడును వదిలిపెట్టనని తెలిపారు.మునుగోడులో బీజేపీ గెలిస్తే, నెలరోజుల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యనించారు.
టీఆర్ఎస్ లో చేరితేనే ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారని ఆరోపించారు.నియోజకవర్గ సమస్యలపై కేసీఆర్ తో మాట్లాడే దమ్ము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని ఆయన విమర్శించారు.







