టాప్ ట్రెండింగ్ లో కొమురం భీమ్.. తారక్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.

 Komaram Bheemudo Song Trending On Number 1, Komaram Bheemudo Song, Jr Ntr, Ram C-TeluguStop.com

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ఈ సినిమా మం టాలీవుడ్ లో ఎప్పుడు ఒక నెవర్ బిఫోర్ మల్టీ స్టారర్ గా మిగిలి పోతుంది.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయి టాలీవుడ్ ను మరోసారి పై స్థాయికి తీసుకు వెళ్ళింది.

ఇక ఈ సినిమాలో హైలెట్ గా నిలిచినా అంశాల్లో ఎన్టీఆర్ పై సాగిన కొమురం భీముడో కూడా ఉంది.ఈ సాంగ్ ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటనను ఆవిష్కరించింది.

ఇండియన్ స్క్రీన్ దగ్గర మరో రేంజ్ లో చూపించిన ఈ సాంగ్ సినిమా రిలీజ్ తర్వాత కేవలం ఎన్టీఆర్ వల్లనే ఈ సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పిన ఎలాంటి తప్పు లేదు.ఈయన తన నటనతో అందరిని కట్టి పడేసాడు.

ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ సాంగ్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు.ఇప్పుడు ఈ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది.ఇంకా 24 గంటలు దాటక ముందే 4 మిలియన్ లకు పైగానే వ్యూస్ తో ఈ వీడియో సాంగ్ ట్రేండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.

మరి ఈ సాంగ్ హవా అయితే ఇప్పుడప్పుడే ఆగేది మాత్రం లేదు అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube