బుల్లితెర నుంచి వెండితెర దిశగా కోమలి సిస్టర్స్ అడుగులు..

కోమలి సిస్టర్స్.తెలుగు బుల్లితెరప ఒకప్పుడు తెగ సందడి చేశారు.

చిన్న వయసులో మంచి గుర్తింపు పొందారు.

మిమిక్రీ ఆర్టిస్టులు అద్భుత కామెడీ పంచారు.

చిన్నతనంలోనే ఈ చిన్నారులు మంచి పేరు పొందారు.సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు.

అదే సమయంలో విమర్శలూ వచ్చాయి.చిన్నారుల జీవితాన్ని టీవీ షోల పేరుతో ఆగం చేస్తున్నారని పలువరు వ్యాఖ్యానించారు కూడా.

Advertisement
Komali Sisters Silver Screen Entry Into Tollywood, Komali Sisters, Hiroshini, De

అయినా వారు తమ మార్క్ కళతో ముందుకు సాగారు.కానీ కొంత కాలంగా వీరిద్దరు కనిపించడం లేదు.

ఇంతకీ వారిద్దరు ఏమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.నిజానికి కోమలి సిస్టర్స్ అసలు పేరు హిరోషిణి, దేవర్షిణి.

వీరిలో హిరోషిణి పెద్దమ్మాయి.దేవర్షిణి చిన్నమ్మాయి.

వీరిద్దరూ మంచి టాలెంట్ ఉన్నవారే.ఒకరిని మించి మరొకరు ఆయా కళల్లో ఆరితేరారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

వీరిద్దరు అప్పట్లో పలు కామెడీ షోలలో పాల్గొనేవారు.మిమిక్రీ ఆర్టిస్టులుగా న్యూస్ ఛానళ్ళలో దర్శనం ఇచ్చేవారు.

Advertisement

ప్రముఖ వార్తా చానెల్ లో పొలిటికల్, మూవీ అంశాలతో రూపొందించిన కామెడీ ప్రోగ్రామ్స్ లో నటించేవారు.వీరి కామెడీతో ఆ షోకు మంచి పేరు వచ్చింది.

వీరికి అంతకు మించి పాపులారిటీ వచ్చింది.అంతేకాదు.

ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆయా షోలకు గాను రెమ్యునరేషన్ బాగానే తీసుకునేవారు.అప్పట్లోనే పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం పెద్దమ్మాయి హిరోషిణి సినిమాల్లో ట్రై చేస్తుంది.ఇప్పటికే తన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఆమె ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఎలాంటి విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.కన్నడ సినిమా పరిశ్రలోనే అడుగు పెట్టేందుకు రెడీ అవుతుందట.

ఇక చిన్నమ్మాయి దేవర్షిణి విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతుంట.ఈమె కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

మున్ముందు ఈ ఇద్దరు అమ్మాయిలు సినిమా రంగంలో కూడా సందడి చేయాలని మనమూ కోరుకుందాం.

తాజా వార్తలు