Actor Appukutty : నేను కూడా రైతునే.. పొలం పనులు అన్నీ వచ్చు.. కోలీవుడ్ హీరో అప్పుకుట్టి కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, కమెడియన్ గా అప్పుకుట్టి( Appukutty ) తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.అప్పుకుట్టి యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

 Kollywood Hero Appukutty Comments Goes Viral In Social Media Details-TeluguStop.com

ప్రస్తుతం ఒక సినిమాలో రైతు పాత్రలో( Farmer ) నటిస్తున్న అప్పుకుట్టి తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తినని చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అప్పుకుట్టి రైతు పాత్రకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కొన్ని సినిమాలలో హీరోగా కొన్ని సినిమాలలో కమెడియన్ గా నటించిన అప్పుకుట్టి తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రశంసలతో పాటు విజయాలను సైతం అందుకుంటున్నారు.అళ్ గర్ సామియిన్ కుదిరై సినిమాలో అప్పుకుట్టి హీరోగా నటించారు.

ఈ సినిమాలో అప్పుకుట్టి యాక్టింగ్ స్కిల్స్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్( National Best Actor Award ) వచ్చింది.శింబు హీరోగా తెరకెక్కిన వెందు తనిందదుక్కాడు సినిమాలో అప్పుకుట్టి కీలక పాత్రలో నటించారు.

Telugu Appukutty, Appukutty Role, Kollywood, Valga Vivasayi-Movie

ప్రస్తుతం అప్పుకుట్టి వాళ్గ వివసాయి, పిరందనాళ్ వాళ్తుగల్ సినిమాలతో బిజీగా ఉన్నారు.వాళ్గ వివసాయి( Valga Vivasayi ) సినిమాలో రైతు రోల్ పోషిస్తున్న అప్పుకుట్టి ఈ సినిమాతో మరో జాతీయ అవార్డ్ ను అందుకునే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అప్పుకుట్టి మాట్లాడుతూ నేను కూడా రైతునేనని తెలిపారు.పొలానికి సంబంధించిన అన్ని పనులు వచ్చని కామెంట్లు చేశారు.

Telugu Appukutty, Appukutty Role, Kollywood, Valga Vivasayi-Movie

పొలం దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం అన్నీ నాకు తెలుసని అప్పుకుట్టి కామెంట్లు చేశారు.రజనీకాంత్( Rajinikanth ) సినిమాలో నటించాలని కోరుకుంటున్నానని అప్పుకుట్టి వెల్లడించారు.అప్పుకుట్టి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అప్పుకుట్టి రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఇతర భాషల్లోని సినిమాలలో సైతం హీరో అప్పుకుట్టి నటించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube