అనకాపల్లి జిల్లా( Anakapalli district ) మాడుగుల గొండపాలెంలో టీడీపీ రా కదలి రా సభ( Raa Kadali Ra ) జరుగుతోంది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రను సీఎం జగన్ అభివృద్ధి చేయలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్రను బంగారు గనిగా మార్చుకున్నారన్న ఆయన ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు.విశాఖ( Visakhapatnam )లో భూములన్నీ కొల్లగొట్టారని మండిపడ్డారు.
విశాఖకు తాను ఎన్నో గ్రూప్ లు తీసుకువస్తే అన్నింటినీ తరిమేశారన్నారు.ఈ క్రమంలోనే లులు గ్రూప్ హైదరాబాద్ కు వెళ్లిపోయిందని చెప్పారు.
సంస్థలన్నింటినీ వెళ్లగొట్టి భూములను రియల్ ఎస్టేట్ కు అమ్ముకున్నారని విమర్శించారు.సమాజం పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత లేదని మండిపడ్డారు.







