పడవలతో నిరసన తెలియజేసిన టిడిపి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర.స్థానిక మచిలీపట్నం కోనేరు సెంటర్ లో ఉప్పొంగిన గోదారిలా ప్రవహిస్తున్న వర్షపు నీరులో పడవ నడిపీ నిరసన తెలియజేసిన టిడిపి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్న అధికార ప్రభుత్వం పై ధ్వజమెత్తారు గడప గడపకు మన ప్రభుత్వం అని అధికారులందరిని వెంటేసుకుని తిరగడం తప్ప బందరు అభివృద్ధి సూన్యం అని ఎద్దేవా చేశారు.
గడచినా 3 సంవత్సరాలు గడిచిన బందరులో డ్రైనేజీలు కానీ కల్వర్టులు కూడా కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర , బందరు మహిళా అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, తెలుగు యువత నాయకులు , తదితర నాయకులు , కార్యకర్తలు , పాల్గొన్నారు.