పెద్దపులిని క్రింద పడేసిన కోతి.... వీడియో వైరల్...

పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే.పెద్దపులి వేట మొదలుపెట్టింది అంటే ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే.

 Monkey Defeats Tiger Video Viral Details, Monkey, Tiger, Monkey Defeats Tiger, S-TeluguStop.com

పులుల లో చాలా రకాల పులులు అడవులలో ఉంటాయి.ఇవి ప్రత్యేకంగా వాటికి ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతాయి.

అలా ఒక పెద్ద పులి వేట మొదలు పెట్టి ఎన్ని కష్టాలు పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే పెద్దపులి ఒక చెట్టు మీద ఉన్న కోతిని వేటాడాలని ప్రయత్నిస్తుంది.

ఆ కోతి మాత్రం పెద్దపులిని ఒక ఆట ఆడుకుంది అని చెప్పాలి.

తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది.

ఆ వానరాన్ని తక్కువ అంచనా వేసిన ఈ పెద్ద పులి దాన్ని చెట్టు మీదే వేటాడాలని చూసింది.వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది.

చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి చెట్టు ఎక్కి చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది.కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చిన విద్య.

అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి.

చేతికి అందినట్లు అంది మరో కొమ్మ పైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది.ఈ వీడియోను ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది చూశారు.

ఈ వీడియోను చూసిన వారిలో కొంతమంది రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు.పులి అడవికి రాజు అయిన కోతి ఉన్న చెట్టు పై దాన్ని వేటాడడం చాలా కష్టమని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

నేల మీద ఉంటే పులి వేటని తప్పించుకోవడం సాధ్యం కాదని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube