ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) ఆగస్టు 30 బుధవారం ఆరంభం అవ్వనున్న సంగతి తెలిసిందే.ఈ టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పాకిస్తాన్ దేశంలోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- నేపాల్( Pakistan-Nepal ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ ఆసియా కప్ ప్రారంభం అవ్వనుంది.ఇక దాయాదులైన భారత్- పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనుంది.

ఈ ఆసియా కప్ టోర్నీలో సచిన్ రికార్డును బ్రేక్ చేసే యోచనలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ( Rohit Sharma, Virat Kohli ) ఉన్నారు.గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో పూర్తిస్థాయిలో ఆడ లేకపోయినా వీరిద్దరూ ఈ టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్ ఆడెందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు.ఇందుకోసం జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ క్యాంప్ లో భారత ఆటగాళ్లు నెట్స్ లో కావలసినంత ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ ఆటగాళ్లు బ్రేక్ చేయాలనుకున్న రికార్డు ఏమిటంటే.ఆసియా టోర్నీ వన్డే ఫార్మాట్ లో( Asian tournament in ODI format ) టీం ఇండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 971 పరుగులతో భారత్ నుంచి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా ముందు వరుసలో ఉన్నాడు.ఇక ఓవరాల్ గా చూసుకుంటే సచిన్ టెండూల్కర్ మూడవ స్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో రోహిత్ శర్మ 745 పరుగులతో ఐదో స్థానంలో.విరాట్ కోహ్లీ 613 పరుగులతో 12వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఈ ఆసియా టోర్నీలో సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్నారు.రోహిత్ శర్మ ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే మరో 227 పరుగులు చేయాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంది.ఫుల్ ఫామ్ కొనసాగిస్తే వీరిద్దరూ సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో భారత జట్టు తమ మ్యాచ్ లన్ని శ్రీలంకలోనే ఆడనుంది.







