సచిన్ టెండుల్కర్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ, రోహిత్..!
TeluguStop.com
ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) ఆగస్టు 30 బుధవారం ఆరంభం అవ్వనున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.పాకిస్తాన్ దేశంలోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- నేపాల్( Pakistan-Nepal ) మధ్య జరిగే మ్యాచ్ తో ఈ ఆసియా కప్ ప్రారంభం అవ్వనుంది.
ఇక దాయాదులైన భారత్- పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనుంది. """/" /
ఈ ఆసియా కప్ టోర్నీలో సచిన్ రికార్డును బ్రేక్ చేసే యోచనలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ( Rohit Sharma, Virat Kohli ) ఉన్నారు.
గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్లో పూర్తిస్థాయిలో ఆడ లేకపోయినా వీరిద్దరూ ఈ టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్ ఆడెందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు.
ఇందుకోసం జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ క్యాంప్ లో భారత ఆటగాళ్లు నెట్స్ లో కావలసినంత ప్రాక్టీస్ చేస్తున్నారు.
"""/" /
ఇంతకీ ఈ ఆటగాళ్లు బ్రేక్ చేయాలనుకున్న రికార్డు ఏమిటంటే.ఆసియా టోర్నీ వన్డే ఫార్మాట్ లో( Asian Tournament In ODI Format ) టీం ఇండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 971 పరుగులతో భారత్ నుంచి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా ముందు వరుసలో ఉన్నాడు.
ఇక ఓవరాల్ గా చూసుకుంటే సచిన్ టెండూల్కర్ మూడవ స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో రోహిత్ శర్మ 745 పరుగులతో ఐదో స్థానంలో.
విరాట్ కోహ్లీ 613 పరుగులతో 12వ స్థానంలో కొనసాగుతున్నారు.ఈ ఆసియా టోర్నీలో సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్నారు.
రోహిత్ శర్మ ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే మరో 227 పరుగులు చేయాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంది.
ఫుల్ ఫామ్ కొనసాగిస్తే వీరిద్దరూ సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో భారత జట్టు తమ మ్యాచ్ లన్ని శ్రీలంకలోనే ఆడనుంది.
How Modern Technology Shapes The IGaming Experience