మాజీ మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధ ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా కాశీలో వంగవీటి రాధ పిండ తర్పణం చేశారు.
ఈ కార్యక్రమంలో వంగవీటి రాధతో పాటు కొడాలి నాని ఉన్నారు.ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా టీడీపీలో వంగవీటి రాధా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వీరిద్దరి కలయికపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.మరోవైపు వంగవీటి రాధ వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ గత కొంత కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.







