గుడివాడ వైసిపి కార్యాలయంలో రంగా వర్ధంతి కార్యక్రమాలు.రంగా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన మాజీ మంత్రి కొడాలి నాని.
కొడాలి నాని కామెంట్స్.రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుడిలా రంగా కుటుంబంతో కలిసి ఉన్నా.
రాజకీయాల్లో ఉన్న లేకున్నా చనిపోయేవరకు రంగా ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తా.టిడిపిలో ఉండగా రాధతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటే, చంద్రబాబు పిలిచి మరి క్లాస్ పీకేవాడు.
రంగాను చంపిన వారే, నేడు ఆయన బూట్లు నాకుతున్నారు.రంగా హత్య కేసులో ఉన్న ఏ ఒక్కరూ వైసీపీలో లేరు, టిడిపిలో పదవులు అనుభవిస్తున్నారు.టిడిపి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి వ్యవస్థగా ఏర్పడి రంగాను కిరాతకంగా హత్య చేశారు.నెహ్రూ లాంటి ఒక వ్యక్తి రంగాను హత్య చేయలేరు, ఆయన మహోన్నత శక్తి.