కుప్పానికే పరిమితమైన చంద్రబాబు ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను పిలిపించుకొని నాన అల్లరి చేస్తున్నాడు.ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో కూడా చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తుంది.
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆఖరికి కుప్పంలో పోరాడాల్సి వస్తుంది.రాష్ట్రంతో పాటుగా, కుప్పంలో కూడా చంద్రబాబు పీడ విరగడ అవుతుంది.
కుప్పంలో అడ్రస్, ఓటర్ కార్డు లేని చంద్రబాబు , ముఖ్యమంత్రి జగన్, పెద్దిరెడ్డికి ఏ రకంగా సవాల్ విసురుతారు.ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు, టిడిపి ,జనసేన, బిజెపి కకావికలం కాక తప్పదు.
ఎవరికోసమో, ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు తీసుకోరు.