సీనియర్ నాయకుడు, పైర్ బ్రాండ్ కొడాలి నాని దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు.గతంలో టీడీపీలో రాజకీయాలు ప్రారంభించిన ఆయన అప్పట్లో ఎలా ఉండేవారో తెలియదు కానీ పార్టీ మారి వైసీపీలోకి అరంగేట్రం చేసిన తర్వాత మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
తన మాటకు తిరుగులేదని అనిపించుకుంటున్నారు.వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు దొరికిన ప్రధాన అస్త్రంగా నాని నిలిచారు.
జగన్ ఏ లక్ష్యంతో నానిని ప్రయోగిస్తున్నారో ? ఆ విషయంలో ఆయన నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారు.గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక నూతన ఒరవడిని తీసుకువచ్చారు.
సామాజిక వర్గాల వారీగా.నేతలను విడదీసి వారితో ప్రతిపక్షం నేతలపై విమర్శలు చేయించేవారు చంద్రబాబు.ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు టీడీపీని విమర్శిస్తే.టీడీపీ నుంచి అదే సామాజిక వర్గం నేతను రంగంలోకి దింపేవారు.
జగన్‌పై ఘాటైన విమర్శలు చేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీ నేతలు, మంత్రులను రంగంలోకి దింపి జగన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టించేవారు.ఆ టైంలో వైసీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయేది.

ఈ విషయంలో జగన్‌ను ఎలా ? తిట్టాలో కూడా పార్టీ అధిష్టానం నుంచి డైరెక్షన్లు కూడా వెళ్లేవి.దీంతో ఇరు పక్షాల మధ్య కామెంట్లు హీటెక్కేవి.ఇప్పుడు అదే ఫార్ములాను జగన్ కూడా వాడుతున్నారు.టీడీపీలో నేతలను టార్గెట్ చేసకునేందుకు ఆయన కూడా సామాజిక వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపుతున్నారు.ఇలానే టీడీపీలోని చంద్రబాబును కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసేందుకు మంత్రి కొడాలిని బాగానే వాడుతున్నారు. దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, నారా లోకేష్ ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ కమ్మ నేతలపై నాని వినడానికి వీళ్లేని విధంగా తిడుతున్నారు.
అటు చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌నే కాకుండా.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (ఈయనా కమ్మ వర్గమే) ను కూడా కొడాలి నాని ఉతికి ఆరేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
స్థానిక ఎన్ని కల విషయంలో నిమ్మగడ్డ తీరును వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత.ఈ క్రమంలో వేరే నాయకులతో కాకుం డా కొడాలి నాని ద్వారా.నిమ్మగడ్డను తీవ్రంగా తిట్టిపోయిస్తోందని అంటున్నారు పరిశీలకులు.తాజాగా కూడా కొడాలి నాని తనదైన స్టయిల్‌లో నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు.
నిమ్మగడ్డ చంద్రబాబు అంటూ.విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆయన పనిచేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.వాస్తవంగా రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న రమేశ్ లాంటి వ్యక్తులపై విమర్శలు చేయడానికి ఎవరైనా ముందు వెనక ఆలోచిస్తారు.
పార్టీ అధిష్టానం కూడా ఇందుకు సాహసించదు.కాని వైసీపీ అధినేత మాత్రం క్యాస్ట్ అస్త్రాన్ని ఇక్కడ బాగా వాడుతోన్న పరిస్థితే ఉంది.
కొడాలి నానిని గతంలో చంద్రబాబు వాడుకున్నారో లేదో తెలియదుకానీ.ఇప్పుడు మాత్రం జగన్ భారీగానే వాడేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.