కొడాలి నాని అంటేనే ఇప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న నేతగా కొనసాగుతున్నారు.ఇకపోతే ప్రత్యర్థులను చీల్చిచెండాడటంలో ఆయన తర్వాతే ఎవరైనా.
తన మాటలతోనే టీడీపీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు కొడాలి నాని.ప్రత్యర్థలు వైసీపీని గానీ లేదంటే జగన్‌ను గానీ ఎలాంటి కామెంట్లు చేసినా సరే వారిమీద విరుచుకుపడుతుంటారు ఇప్పడు పవన్‌ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
పవన్ మీద మరోసారి సంచలన ఆరోపనలు చేశారు కొడాలి నాని.పవన్ కు ఇప్పుడు ఏపీలో రాజకీయ అడ్రస్ బలంగా లేదంటూ సంచలన కామెంట్లు చేశారు.
మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు తన కొడుకు లోకేశ్ మీద నమ్మకం లేక దత్త పుత్రుడు అయిన పవన్ కల్యాణ్‌ను నమ్ముతున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు.పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తే ఆయనంత అమాయకుడు మరొకరు ఉండరంటూ కామెంట్లు చేశారు.
అంతే కాదు పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో చంద్రబాబు ఆడిస్తున్న గంగిరెద్దు అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు కొడాలి నాని.ఇదే సమయంలో మరోసారి సామాజి వర్గాల అంశాన్ని తెరమదకు తెచ్చి పవన్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు.

అదేంటంటే రాజకీయంగా పోటీ చేసే ఏ పార్టీ అయినా బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుంది కానీ పవన్ కమ్మ సామాజిక వర్గాన్ని నెత్తిన ఎత్తుకుంటున్నారని ఆ వర్గానికి అండగా ఉంటానంటూ చెప్పడం దేనికి సంకేతమని మండిపడ్డారు.బలహీన వర్గాలకు పవన్ ఎప్పుడూ దూరమేనని మరోసారి కామెంట్ చేశారు.కుల ప్రస్తావన తేనని కుల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పవన్ ఎందుకు కుల ప్రస్తావన తెస్తున్నారంటూ ప్రశ్నించారు.ముందు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
మొత్తానికి పవన్ ఇచ్చిన మాటలను గుర్తు చేస్తూ ఆయన్ను ప్రశ్నిస్తున్నారు కొడాలి నాని.







