చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని..

కృష్ణా జిల్లా గుడివాడ: చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.

 Kodali Nani Fires On Chandrababu Naidu, Kodali Nani , Chandrababu Naidu, Ntr Var-TeluguStop.com

నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు.తనపై,సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు.సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు,నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు.14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా.ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని.చావటానికైన సిద్ధంగా ఉన్నా.

చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను.గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు.

నేను గుడివాడ ముద్దు బిడ్డను.నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది,మరో నాలుగేళ్లు గెలుస్తా.

చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు.తెలంగాణ బూ స్థాపితం చేశాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు.5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు.లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు.లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు.వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు.కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది.75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు.ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు.కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం.

మరదలిని చంపి,తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు.తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తె, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube