ఈమధ్య కేటుగాళ్ళు సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా వదలడం లేదు.మొన్న సింగర్ సునీత గారి పేరు చెప్పి ఒకడు జనాలు దగ్గర డబ్బులు దండుకున్నాడు.
ఇక తాజాగా మరో వ్యక్తి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావును మోసం చేయాలని చూసాడు.అతని తీరు చూసి అనుమానం వచ్చిన కే.కే కూతురు విజయ లక్ష్మీ ఆరా తీస్తే అతను చెప్పిందంతా అబద్దమని తెలిసింది.దీనితో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
మహేష్ అనే వ్యక్తి తాను కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ అని కే.కే కు తనని తాను పరిచయం చేసుకున్నాడు.మంత్రి కేటీఆర్ సిఫార్సుతో కొంత మంది నిరుద్యోగులకు రుణాలు ఇప్పించే పథకాన్ని కల్పిస్తామని నమ్మబలికాడు అతని మాటలు నమ్మిన కే.కే బజారాహిల్స్ కార్పొరేటర్ అయిన తన కూతురు విజయ లక్ష్మీకు చెప్పాడు.ఆమె తన అనుచరుల్లో కొంత మందికి విషయం చెప్పింది.వారు ఒక్కొక్కరు 1.25 లక్షల ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని మహేష్ పెట్టిన షరతుకు అంగీకరించారు.దానికి విజయ లక్ష్మీ అనుచరులు సరే అనడంతో 25 మందికి రుణాలు ఇప్పించేందుకు మహేష్ అంగీకరించాడు.
మహేష్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కేకే ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని తన అనుచరులను సూచించి విషయం మీద ఆరా తీశారు.దీనితో ఆ వ్యవహారం అంతా బోగస్ అని తేలడంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.