బాటిల్ క్యాప్ ఛాలెంజ్ సూపర్ కేంద్ర మంత్రి కూడా చేసేశారుగా

ప్రస్తుతం సోషల్ మీడియా లో బాటిల్ క్యాప్ ఛాలెంజ్ విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అక్షయ్ కుమార్,సోనూసూద్,సుస్మితా సేన్, సీనియర్ నటుడు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛాలెంజ్ ని స్వీకరించి అదరగొట్టారు.

 Kiren Rijiubottle Capchallenge-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ రాజకీయ నేతలకు కూడా పాకింది.కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు బాటిల్ క్యాప్ చాలెంజ్ స్వీకరించి ఒక సీసా మూతను కాలితో తెరిచారు.

దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేశారు.చాలెంజ్‌లో ఏం చేస్తారంటే.

ముందుగా ఓ బాటిల్‌ను టేబుల్‌పై పెట్టాలి.బాటిల్ మూతను కాస్త వదులుగా ఉంచాలి.

అనంతరం దానికి కొంచెం దూరంలో నిలబడి బాటిల్ కిందపడకుండా కేవలం దాని మూత మాత్రమే ఊడిపోయేలా కాలితో తన్నాలి.ఐతే.ఇది అంత ఈజీ చాలెంజ్ కాదు.దీనికి టెక్నిక్ కావాలి.

ఫిట్‌నెస్‌ కావాలి.అందుకే ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే పేరున్న రిజిజు ఈ చాలెంజ్‌ను ఈజీగా చేసేశారు.

సోషల్‌ మీడియా పుణ్యమాని ‘ఫిట్‌నెస్ చాలెంజ్’ ‘గ్రీన్ చాలెంజ్’ వంటివి తెర మీదకు వచ్చాయి.ఇప్పుడు ఇదే తరహాలో ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’ హల్‌చల్‌ చేస్తోంది.

బాటిల్ క్యాప్ ఛాలెంజ్ సూపర్ క�

సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఇప్పుడీ చాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు.అయితే యువతకు మెస్సేజ్ ఇచ్చే ఉద్దేశ్యం తో రిజుజి ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు.ఆయన ఈ ఛాలెంజ్ ద్వారా యువతకు ఓ సందేశం కూడా ఇచ్చారు.యువతే మన దేశ భవిష్యత్.మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి.ఆరోగ్య భారత్ ప్రచారానికి సిద్ధంకండి అని పిలుపునిచ్చారు.

ఏకాగ్రత దృష్టితో విజయం సాధ్యం.మంచి ఆరోగ్యంతో చాలా సంతోషకరమైన జీవితం గడపవచ్చు అని కిరణ్ రిజిజు యువతకు సందేశమిచ్చారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube