టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ తో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకు పోతున్నాడు కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ). ఈయన ముందు నుండి కూడా ఆడియెన్స్ ను మెప్పించగల సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
ఒక్కో సినిమా ఒక్కో విభిన్నంగా ఎంచుకుంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ స్టార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన మూవీ ”రూల్స్ రంజన్’ ( Rules Ranjann ).ఈ సినిమాను ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ (Rathinam Krishna) డైరెక్ట్ చేయగా ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు.ఇక ఈ సినిమాలో నేహా శెట్టి కిరణ్ అబ్బవరంకు జోడీగా నటించింది.
దీంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.అందులోను నేహా శెట్టి ( Neha Shetty ) వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది.మొదటి సినిమా డీజే టిల్లు సినిమాతోనే ఆకట్టుకుని తన అందాలతో యూత్ ను తనవైపుకు తిప్పుకోవడంలో సఫలం అయ్యింది.ఇక ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వరిస్తున్నాయి.
యంగ్ హీరోల సరసన బెస్ట్ ఛాయిస్ అవ్వడంతో ఈ భామ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక రూల్స్ రంజన్ నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్( Rules Ranjan Trailer ) ఆద్యంతం అలరించే విధంగా ఉంది.కథ, కథనాలు ఎలా ఉన్న ట్రైలర్ లో కామెడీ మాత్రం హైలెట్ గా చూపించారు.దీంతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.కిరణ్ అబ్బవరంతో పాటు హైపర్ ఆది, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య వంటి వారు తమ కామెడీ టైమింగ్ తో సినిమాపై క్రేజ్ పెరిగేలా చేసారు.
ఇక సలార్ వాయిదా పడడంతో సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.మరి ఈ సినిమా ఈ యంగ్ హీరో అండ్ హీరోయిన్ కెరీర్లకు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.







