గుట్కా నాయాళ్ళు వేట కొడవళ్లతో వెంటపడ్డారు... కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు!

ఏపీ ఎన్నికల ఫలితాలు( AP Election Results ) ఇన్ని రోజులు ఎంతో ఉత్కంఠతను కలిగించాయి.అయితే నిన్నటితో ఈ ఉత్కంఠతకు తెర తొలగింది.

 Kirak Rp Sensational Comments On Ysrcp Leaders , Kirak Rp, Jabardsath, Ysrcp Lea-TeluguStop.com

వైఎస్ఆర్సీపీ అధిక మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు కానీ కూటమి 164 సీట్లతో భారీ మెజారిటీ సాధించి విజయం అందుకుంది.ఇక ఎవరు ఊహించని విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.

ఇలా వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా గతంలో వైసీపీ పార్టీ ( YCP Party ) గురించి సంచలన ఆరోపణలు చేసినటువంటి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ( Kirak RP ) తాజాగా కూటమి విజయం పై స్పందించారు.ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ.కూటమి గెలవడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు  అయితే గతంలో తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో తనపై పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి అంటూ ఈయన అసలు విషయాలు వెల్లడించారు.

కొంతమంది గుట్కా నాయాళ్ళు అర్ధరాత్రిలు తన ఇంటికి వచ్చి డోర్లు కొట్టేవారని తన వెంట కత్తులు పట్టుకొని ఫాలో అయ్యే వారిని తెలిపారు.

ఇకపోతే నా బిజినెస్ పై కూడా దెబ్బ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు .నాకు కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలను అడ్డుకున్నారని , రేపు అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటే ఇవాళే వారిని ఆపేసేవారని కిరాక్ ఆర్పీ.జూన్ నాల్గవ తేదీ మా పార్టీ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంటి అని చాలామంది వైసీపీ నేతలు నన్ను బెదిరించారు.

ఇప్పుడు మీ పరిస్థితి ఏంటని ఈయన ఎదురు ప్రశ్నించారు.ఆర్పీ అనేవాడు అన్ని వదులుకుని రోడ్డుపై నిలబడి ఆరోజున ప్రెస్‌మీట్ పెట్టాడని.మీలో ఒక్కడికైనా ఆర్పీలా ఎదిరించగలరా అంటూ ప్రశ్నిస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube